గవర్నర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌

అస్వస్ధతకు గురై విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ను

By Medi Samrat
Published on : 19 Sept 2023 6:25 PM IST

గవర్నర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌

అస్వస్ధతకు గురై విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ను మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఆయ‌న ఆరోగ్య పరిస్ధితిపై డాక్టర్లను వాకబు చేశారు. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరుపతి, కర్నూలు, నంద్యాల పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి జ‌గ‌న్‌.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా మణిపాల్‌ ఆస్పత్రికి వెళ్ళి గవర్నర్‌ను పరామర్శించారు.

Next Story