దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెన‌ల‌తో.. ల‌క్ష్యాలు సాకారం అవుతున్నాయి : సీఎం జ‌గ‌న్‌

CM Jagan Tweet on YSRCP 12th Anniversary.వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోవ‌త్సవ వేడుక‌ల‌ను ఆ పార్టీ నేత‌లు, శ్రేణులు ఘ‌నంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2022 6:38 AM GMT
దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెన‌ల‌తో.. ల‌క్ష్యాలు సాకారం అవుతున్నాయి : సీఎం జ‌గ‌న్‌

వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోవ‌త్సవ వేడుక‌ల‌ను ఆ పార్టీ నేత‌లు, శ్రేణులు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నాయి. వైఎస్సార్‌సీపీ 11 వసంతాలు పూర్తి చేసుకుని నేడు(మార్చి 12న) 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పందిస్తూ.. 'దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! 'అని ట్వీట్‌ చేశారు.

ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తాడేపల్లిలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో పాల్గొని మాట్లాడారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త‌మ‌ పార్టీ నడుస్తోందన్నారు. జ‌గ‌న్ ఒక సమర్థమైన సీఎంగా నిరూపించుకున్నారని తెలిపారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్రజల కోసం సమైక్యంగా ముందుకు నడవాలన్నారు. అందరికీ న్యాయం చేయడమే ల‌క్ష్యంగా జ‌గ‌న్ పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Next Story