సీఎం జగన్ వ్యాక్సిన్ తీసుకునేది అప్పుడే..
CM Jagan Takes Vaccine On April 1st. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏప్రిల్ 1న గుంటూరులో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 29 March 2021 3:32 PM GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏప్రిల్ 1న గుంటూరులో పర్యటించనున్నారు. పర్యటనలో బాగంగా భారత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం జగన్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఎంపీ మోపిదేవి, మేయర్ మనోహర్, ఎమ్మెల్యే మద్దాలగిరి, జిల్లా అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ.. కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ఆర్థిక భారం పడుతున్నప్పటికీ వ్యాక్సినేషన్‌లో ముందున్నామని తెలిపారు.
సెకండ్ వేవ్ పరిస్థితి తీవ్రంగా ఉందని.. ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏప్రిల్ 1నుంచి సచివాలయాల్లో అందుబాటులో తెస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 1న సీఎం జగన్ వ్యాక్సిన్ తీసుకుంటారని.. ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలు తొలగాలని.. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలంతా పాటించాల అని అన్నారు.