రోడ్లను బాగుచేయడంపై దృష్టి పెట్టండి : సీఎం జగన్
CM Jagan review on Roads ports and airports.అక్టోబర్ నాటి కల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని, ఆ వెంటనే
By తోట వంశీ కుమార్ Published on 6 Sept 2021 4:17 PM ISTఅక్టోబర్ నాటి కల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని, ఆ వెంటనే రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, శంకర్‌నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్టోబర్ మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పనుల కాలం మొదలవుతుందన్నారు.
ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ వర్షాలకాలం వచ్చేలోగా రోడ్డు అన్నింటినీ బాగుచేయాలన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టామని.. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారని సీఎం మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏడాది సంవృద్దిగా వర్షాలు పడుతున్నాయన్నారు. దేవుడి దయ వల్ల వర్షాలు పడడం వల్ల రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని.. వాటిని బాగుచేయడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టిందన్నారు.
ఇక.. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంటున్నామని, ఒక నిధిని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. కొందరు కావాలనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారని.. అయినప్పటికి మనం చేయాల్సిన పనులు చేద్దామన్నారు. ఈ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని ముందుకు అడుగులు వేద్దామన్నారు. మనం బాగు చేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్షాలుగా నిలబడయాని సీఎం జగన్ అన్నారు.