ఒడిశా రైలు ప్రమాదం.. ఏపీకి చెందిన బాధితులకు పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశం

Cm Jagan Review On Odisha Train Accident Announces Rs 10 Lakh Ex Gratia To Deceased Families. ఒడిశాలోని బాలోసోర్‌ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌ సమీక్షించారు

By Medi Samrat  Published on  4 Jun 2023 10:15 AM GMT
ఒడిశా రైలు ప్రమాదం.. ఏపీకి చెందిన బాధితులకు పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశం

అమరావతి: ఒడిశాలోని బాలోసోర్‌ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌ సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విశాఖపట్నంలో మరో మంత్రి బొత్స సత్యన్నారాయణ నేతృత్వంలో పర్యవేక్షణ కార్యకలాపాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తీవ్రంగా గాపడ్డవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.1లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి అదనంగా ఇది ఇవ్వాలని సీఎం స్పష్టంచేశారు. బాలాసోర్‌లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు మరణించారని, ఇదితప్ప రాష్ట్రానికి చెందినవారెవరూ ఈ ఘటనలో మరణించినట్టుగా ఇప్పటివరకూ నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారికి మంచి వైద్యసదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


Next Story