ముస్లీం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన‌ సీఎం జ‌గ‌న్‌

CM Jagan Ramzan Wishes To People. ముస్లీం సోద‌రుల‌కు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

By Medi Samrat  Published on  21 April 2023 3:11 PM GMT
ముస్లీం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన‌ సీఎం జ‌గ‌న్‌

CM Jagan


ముస్లీం సోద‌రుల‌కు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి అన్నారు. కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి అన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని ముఖ్యమంత్రి తన సందేశంలో తెలిపారు.


Next Story