సీఎం వైఎస్‌ జగన్ రాయ‌ల‌సీమలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్రవారం బద్వేలు, కడప నియోజకవర్గాల్లో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నేఫ‌థ్యంలోనే సీఎం జ‌గ‌న్‌.. వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఫ్లడ్ లైట్స్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జగన్ చేతుల‌కు గ్లౌవ్స్ ధ‌రించి క్రికెట్‌ బ్యాట్ పట్టారు. రెండు బంతులు ఆడి అభిమానుల్ని అలరించారు. జ‌గ‌న్ ఆడుతుండ‌గా.. ప‌క్క‌న ఉన్న అధికారులు, నేత‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ బ్యాటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.సామ్రాట్

Next Story