పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండదు : సీఎం జగన్

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు

By Medi Samrat  Published on  23 Feb 2024 7:29 AM GMT
పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండదు : సీఎం జగన్

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశామన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని.. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని.. ఇంటింటికీ తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని అన్నారు.

పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టామని సీఎం జగన్ తెలిపారు. ఇంగ్లీష్‌, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామని.. కార్పొరేట్‌ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు తీసుకుని వచ్చామన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నామని.. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచామన్నారు. ఆస్పత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చేశామని తెలిపారు. రోగులు కోలుకునే వరకు ఆసరాగా ఉంటున్నామని.. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు.

Next Story