ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్‌

CM Jagan launched AP Tourism coffee table books. ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్

By Medi Samrat  Published on  24 Feb 2023 10:28 AM GMT
ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్‌

ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ శుక్ర‌వారం ఆవిష్కరించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 నేపధ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌పై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్‌ బాషల్లో పుస్తకాలు ప్ర‌చురించింది. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో ఏపీ ప్రత్యేకతలు పుస్తకాలలో వివరించారు. ఏపీలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలుగా ప్రచురించింది.

బెస్ట్‌ టూరిజం పాలసీ అవార్డును ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ కైవసం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ఆ శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవార్డు తీసుకున్నందుకు ముఖ్య‌మంత్రి అధికారుల‌ను అభినందించారు. రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ రజత్‌ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.కరికాల్‌ వలవెన్, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మ విజయ్‌కుమార్‌ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Next Story