ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న నూతన మంత్రి వర్గం కొలువుదీరనుంది. ఇప్పటి వరకు మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఈ రోజు కేబినేట్ భేటీ ముగిసిన అనంతరం తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మీ అందరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తొలివిడత అవకాశం ఇచ్చాం. ఇకపై మీరందరూ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతల్లోకి వెళతారు. మీకున్న అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించండి. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం' అని అన్నారు.
రాజీనామా అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. 'కేబినేట్‌లో కొందరు సమర్థులు కావాలి. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే వ్యక్తులు కావాలి. అవగాహన కలిగిన వారు కావాలి. పార్టీలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో సీఎం జగన్‌కు తెలుసుకు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహించేందుకు సిద్దం' అని కొడాలి నాని అన్నారు.