నేడు 'విజన్ విశాఖ' సదస్సు.. యువత భవితకు సీఎం జగన్ శ్రీకారం
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. 'విజన్ విశాఖ' సదస్సులో పాల్గొని రెండు వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.
By అంజి Published on 5 March 2024 1:21 AM GMTనేడు 'విజన్ విశాఖ' సదస్సు.. యువత భవితకు సీఎం జగన్ శ్రీకారం
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. 'విజన్ విశాఖ' సదస్సులో పాల్గొని రెండు వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. అనంతరం యువతకు నైపణ్య శిక్ష ఇచ్చేందుకు చేపట్టిన ‘ది క్యాస్కేడింగ్ స్కిల్స్ ప్రాడిగ్మ్-భవిత’ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమం ద్వారా, కార్మికులకు పరిశ్రమల సమలేఖన నైపుణ్యాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీలో యువతకు దీర్ఘకాలిక ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించడంలో ఇది కీలకమైన చర్య అని ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యక్రమం వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా పోటీ కార్మిక మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను అందిస్తుంది.
స్కిల్ క్యాస్కేడింగ్ నమూనాలో రాష్ట్రవ్యాప్తంగా 192 నైపుణ్య కేంద్రాలు, 26 నైపుణ్య కళాశాలలు ఉన్నాయి. ఈ కేంద్రాలు, కళాశాలలు ఎక్సలెన్స్ కేంద్రాలుగా పనిచేస్తాయి. పరిశ్రమకు సంబంధించిన శిక్షణను అందిస్తాయి. విద్యా సంస్థలు. పరిశ్రమ భాగస్వాముల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తాయని అధికారిక ప్రకటన పేర్కొంది. రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ సమస్యల పరిష్కారానికి ఇదొక సాహసోపేతమైన చర్య అని ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.
ఇదిలా ఉంటే.. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9.10 గంటలకు సీఎం తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. ఉదయం 10.45 గంటలకు విశాఖపట్నం చేరుకుని ఓ ప్రైవేట్ బీచ్ రిసార్ట్‌లో 'డెవలప్‌మెంట్ డైలాగ్-అన్విలింగ్ విజన్ విశాఖ'లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధురవాడలోని కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లి క్యాస్కేడింగ్ స్కిల్స్ ప్యారడిగ్మ్-భవితను ప్రారంభిస్తారు.