అప్పులపై రోజూ దుష్ప్రచారం చేస్తున్నారు

CM Jagan in Assembly on debts. అప్పులపై ఎల్లో మీడియా, చంద్రబాబు రోజూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు

By Medi Samrat  Published on  16 Sept 2022 3:42 PM IST
అప్పులపై రోజూ దుష్ప్రచారం చేస్తున్నారు

అప్పులపై ఎల్లో మీడియా, చంద్రబాబు రోజూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు. విభజన నాటికి రాష్ట్రం రుణాలు రూ.1.26 లక్షల కోట్లు ఉండ‌గా.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.2.69 లక్షల కోట్లకు చేరింద‌ని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123 శాతం అప్పులు పెరిగాయని అన్నారు. ఈ మూడేళ్లలో రూ.3.82 లక్షల కోట్లకు రుణాలు చేరాయని తెలిపారు. మూడేళ్లలో పెరిగిన రుణం 41.83 శాతం మాత్రమేన‌ని.. ఈ మూడేళ్లలో రాష్ట్రం అప్పులు 12.73 శాతం మాత్రమేన‌ని వివ‌రించారు.

ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువని పేర్కొన్నారు. 2014లో ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు రూ.14,028 కోట్లు కాగా.. చంద్రబాబు దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.59,257 కోట్లకు చేరింద‌ని వెల్ల‌డించారు. చంద్రబాబు హయాంలో మొత్తం రుణాలు రూ.3.28 లక్షల కోట్లని.. ఆ ఐదేళ్లలో పెరిగిన రుణాలు 144 శాతం అని వివ‌రించారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.1. 71 లక్షల కోట్లు కాగా.. గత అప్పుతో కలుపుకుంటే రుణాలు రూ.4.99 లక్షల కోట్లు.. ఈ మూడేళ్లలో పెరిగిన రుణం 52 శాతం మాత్రమేన‌ని పేర్కొన్నారు.


Next Story