కీలక సమావేశం నిర్వహించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల మోడ్ లోకి వెళ్ళిపోయింది. కూటమి వర్సెస్ వైసీపీగా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  18 March 2024 9:15 PM IST
కీలక సమావేశం నిర్వహించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల మోడ్ లోకి వెళ్ళిపోయింది. కూటమి వర్సెస్ వైసీపీగా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తాము అందించిన సంక్షేమ పథకాలే తమను తిరిగి అధికారం లోకి తీసుకుని వస్తాయని వైసీపీ భావిస్తోంది. నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్టీ రీజనల్‌ కో ఆర్డీనేటర్ల సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర, రూట్‌ మ్యాప్‌, మేనిఫెస్టో వంటి విషయాలపై ఓ క్లారిటీ రానుంది.

మేమంతా సిద్ధం.. పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్‌ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెల రోజులపాటు సీఎం జగన్ జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక మేనిఫెస్టోను ప్రకటించి జనానికి చేయబోయే మేలు ఏమిటో కూడా చెప్పాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు.

Next Story