ఏపీ ప్రజలకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. ఇకపై సంక్షేమ పథకాలకు ఆ సర్టిఫికేట్ అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సీఎం జగన్‌ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అర్హులను వెంటనే గుర్తించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on  3 Oct 2023 2:11 AM GMT
CM Jagan, AP Government, income certificates, APnews

ఏపీ ప్రజలకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. ఇకపై సంక్షేమ పథకాలకు ఆ సర్టిఫికేట్ అవసరం లేదు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సీఎం జగన్‌ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అర్హులను వెంటనే గుర్తించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం మరింత ఈజీ చేసింది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సోషల్‌ వెల్ఫేర్‌ స్కీమ్‌ల కోసం ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేస్తూ.. రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. బియ్యం కార్డు ద్వారా పేద కుటుంబాల ఆదాయాన్ని నిర్దారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ అధికారులు ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికేట్లు అడగొద్దని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది.

అయినా పలు డిపార్ట్‌మెంట్‌లు వీటిని స్పెషల్‌గా అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో అప్లికేషన్‌ పెట్టుకునేవారు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్లు లేని 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ సర్టిఫికెట్‌ వీటికి సరిపోతుంది.

ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్‌ టైమ్‌లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్‌ సర్వీసుల సాఫ్ట్‌వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్‌ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో అందుకోసం మాత్రమే పత్రాలను జారీ చేస్తుంది ప్రభుత్వం.

Next Story