వాలంటీర్ల‌కు సీఎం జ‌గ‌న్ ఉగాది కానుక‌.. సత్కారంతో పాటు నగదు పురస్కారం

CM Jagan decided to give awards for volunteers in 3 categories.ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2021 11:47 AM IST
వాలంటీర్ల‌కు సీఎం జ‌గ‌న్ ఉగాది కానుక‌.. సత్కారంతో పాటు నగదు పురస్కారం

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు, గ్రామ స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఏపీ ప్ర‌భుత్వం గ్రామ‌వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చింది. ప్ర‌భుత్వ పాల‌న‌లో కీలకంగా మారిన వాలంటీర్ల విష‌యంలో సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున వాలంటీర్లకు అవార్డులు, న‌గదు పుర‌స్కారా‌ల‌ను ఇవ్వనుంది ప్ర‌భుత్వం. గత ఏడాది కాలంగా ఎవరైతే తమ బాధ్యతలను సక్రమంగా, ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా, సేవా దృక్పదటంతో పనిచేశారో వారికి గుర్తింపు ఇవ్వ‌నున్నారు.

మొత్తం మూడు కేటగిరిలో గ్రామవాలంటీర్లను ఎంపిక చేసి.. వారికి సేవా ర‌త్న‌, సేవా మిత్ర‌, సేవా వ‌జ్ర వంటి బిరుదులు ఇవ్వనున్నారు. పక్షపాతం చూపకుండా, అవినీతి చేయకుండా సేవా దృక్పథాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాలకు హాజరవుతానని సీఎం చెప్పారు.

కేటగిరి 1

ఏడాది పాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలిస్తారు. ఇందులో ఎంపికైన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జ్, రూ.10 వేల నగదు బహుమతి.

కేటగిరి 2

ప్రతి మండలం, పట్టణంలో ఐదుగురు చొప్పున వాలంటీర్ల ఎంపిక. వీరికి సేవా రత్న పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి.

కేటగిరి 3

ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్ల ఎంపిక. వీరికి సేవా వజ్రం పేరిట పురస్కారం, స్పెషల్‌ బ్యాడ్జ్‌తో పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారం.


Next Story