వైద్య, ఆరోగ్య శాఖను అభినందించిన సీఎం జగన్‌

CM Jagan congratulated the medical and health department. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని, అధికారులను మంగ‌ళ‌వారం సీఎం వైఎస్‌ జగన్ అభినందించారు.

By Medi Samrat  Published on  13 Dec 2022 3:45 PM GMT
వైద్య, ఆరోగ్య శాఖను అభినందించిన సీఎం జగన్‌

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని, అధికారులను మంగ‌ళ‌వారం సీఎం వైఎస్‌ జగన్ అభినందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మంత్రి విడ‌ద‌ల ర‌జినితో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కలిశారు. రాష్ట్రానికి వచ్చిన అవార్డులను ముఖ్య‌మంత్రికి చూపించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని వెంట సీఎం ను క‌లిసిన వారిలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉన్నారు. ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను మంత్రి రజని, కృష్ణబాబు అందుకున్నారు. టెలికన్సల్టేషన్‌ విభాగంలో, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ల విభాగంలో కేంద్రం నుంచి ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ రెండు అవార్డులు గెలుచుకుంది.


Next Story