ఆ విషయంలో నాకు అసంతృప్తి ఉంది : సీఎం జగన్
వైసీపీ అభ్యర్థుల లిస్టును తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.
By Medi Samrat Published on 16 March 2024 9:29 AM GMTవైసీపీ అభ్యర్థుల లిస్టును తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. అభ్యర్థుల జాబితా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని.. రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో చేశామని.. వారికి ఎంతో సామాజిక న్యాయం చేసినా అది కూడా నాకు సంతృప్తిని ఇవ్వడం లేదన్నారు. రానున్న రోజుల్లో మహిళల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని.. ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నానని అన్నారు.
ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చేసి చూపించగలిగామని అన్నారు సీఎం జగన్. 50 శాతం కచ్చితంగా నా అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం తమదని చెప్పారు. మొత్తం ఈరోజు 200 స్థానాలకు గానూ 100 స్థానాలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు ఇవ్వగలగడం ఇది చరిత్రలోనూ, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టమని అన్నారు సీఎం జగన్. ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశామన్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగిందని వివరించారు. మార్పు చేసిన వారికి.. టికెట్ రాని వారికి మనస్పూర్తిగా చెబుతున్నా.. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు.