కష్టాల్లోనూ మంచి బడ్జెట్ అందిస్తున్నాం..మీదే బాధ్యత: సీఎం చంద్రబాబు

కష్టాల్లో కూడా మంచి బడ్జెట్‌ను ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on  28 Feb 2025 2:54 PM IST
Andrapradesh, Ap Budget, Assembly, Cm Chandrababu, Tdp MLAs

కష్టాల్లోనూ మంచి బడ్జెట్ అందిస్తున్నాం..మీదే బాధ్యత: సీఎం చంద్రబాబు

కష్టాల్లో కూడా మంచి బడ్జెట్‌ను ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. ఈ బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుక వెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని పేర్కొన్నారు.

కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే మీ పని తీరులో మార్పు రావాలని సూచించారు. మళ్లీ సభకు రావాలనే భావనతోనే ఎమ్మెల్యేలు పనిచేయాలన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమన్వయం ఉండాలని సూచించారు. ఎక్కడ గ్రూపులకు తావులేదని, విబేధాలు సహించను అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఈరోజు నుంచే పని చేయండి. మీరందరూ మళ్లీ గెలవాలి. ఆర్థిక కష్టాల్లోనూ జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాం. మీ అందరి పని తీరుపై నేను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నాను. త్వరలోనే ఓన్ టు ఓన్ మాట్లాడుతా. పార్టీపై పటిష్టంపై దృష్టి పెట్టండి. పార్టీని వదిలేస్తే ఎవ్వరినీ ఉపేక్షించను. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులపై కూడా ఫోకస్ చేయండి. అని టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు.

Next Story