అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం ఐవీఆర్‌ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని, ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాల్లో మార్పులు చేస్తామన్నారు.
అలాగే ఉచిత ఇసుక, మద్యం కొత్త పాలసీపై అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. నిరంతర ఫీడ్ బ్యాక్ ఆధారంగా సేవలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అటు ఈ నెల 3వ తేదీ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే నేటి సాయంత్రంలోపు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు కార్యదర్శులకు సీఎస్ నీరబ్ కుమార్ సర్క్యూలర్ జారీ చేశారు.