Andhrapradesh: డ్వాక్రా మహిళలకు శుభవార్త
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో రూ.55 కోట్లతో 129 ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
By అంజి Published on 29 Oct 2024 1:05 AM GMTAndhrapradesh: డ్వాక్రా మహిళలకు శుభవార్త
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో రూ.55 కోట్లతో 129 ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఈ ప్రాజెక్టుల వ్యయం ఉండనుంది. నవంబర్ రెండో వారంలో వీటిని ప్రారంభించనుంది. మొత్తం వ్యయంలో 35 శాతం రాయితీ ఉండగా, 10 శాతం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణం అందిస్తుంది. ఇందుకోసం కేంద్ర పథకాలైన పీఎంఎఫ్‌ఎమ్‌ఈ, పీఎంఈజీపీలను అనుసంధానించనుంది. ఈ 129 సూక్ష్‌మ, చిన్న తరహా ప్రాజెక్టులను సంఘాలుగా కాకుండా వ్యక్తిగతంగా ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన వారికి కేటాయించారు.
ఇందులో 64 మంది మహిళలు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పుతుండగా.. మరో 65 మంది ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తృతపరుచుకోనున్నారు. వీటి అమలు తీరు పరిశీలించిన తర్వాత రెండో విడతలో మరో 13 వేల మందికి లబ్ధి చేకూరేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఏర్పాటు కానున్న ప్రాజెక్టుల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి. జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు, హైజిన్ ప్రొడక్ట్స్, బెల్లం ఉత్పత్తి, ఆయిల్ మిల్లు, మిల్లెట్ అండ్ హెర్బల్ యూనిట్, డెయిరీ ఫాం, బేకరీ, స్నాక్స్ యూనిట్, కిరాణా దుకాణాలు, పచ్చళ్ల తయారీ, సిమెంటు బ్రిక్స్ యూనిట్, ఎంబ్రాయిడరీ, ఐస్‌క్రీమ్ తయారీ, గార్మెంట్స్, కారంపొడి తయారీ, తేనె తయారీ