విద్యార్థులకు భారీ శుభవార్త.. వారి స్కాలర్‌షిప్‌ రూ.12,000కు పెంపు

సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ వర్సిటీల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది.

By అంజి
Published on : 8 Feb 2025 6:38 AM IST

CM Chandrababu, agriculture students, scholarship, APnews

విద్యార్థులకు భారీ శుభవార్త.. వారి స్కాలర్‌షిప్‌ రూ.12,000కు పెంపు

అమరావతి: సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ వర్సిటీల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. అలాగూ అగ్రి కల్చర్‌, పశువైద్య విద్యార్థుల స్కాలర్‌షిప్‌ను రూ.7 వేల నుంచి రూ.10 వేలకు, పీజీ (పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌) విద్యార్థులకు రూ.12 వేలకు పెంచింది. దీంతో పాట సన్నరకం వరి సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యాదవ, కురబలకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా, ఉద్యానవన, పశుసంవర్ధఖ రంగాల వారీగా సెమినార్లు నిర్వహించాలని, రైతులు, శాస్త్రవేత్తల పార్ట్‌నర్‌షిప్‌తో కార్యశాలలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

''ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే...మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం'' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story