నేడు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు.

By Knakam Karthik
Published on : 7 Aug 2025 7:04 AM IST

Andrapradesh, Guntur District, Cm Chandrababu,  National Handloom Day today

నేడు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

అమరావతి: సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంగళగిరిలో మంత్రి లోకేష్ సహకారంతో గతంలో ఏర్పాటైన వీవర్స్ శాలను సందర్శిస్తారు.

అక్కడ మగ్గాలను, చేనేత వస్త్రాలను పరిశీలిస్తారు. హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు మార్కెటింగ్ ఏ విధంగా ఉందనే అంశాలపై వీవర్స్ శాలలోని చేనేత కళాకారులతో సంభాషిస్తారు. అనంతరం చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.

చేనేత కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Next Story