Andhrapradesh: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం

పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

By అంజి
Published on : 30 March 2025 8:02 AM IST

CM Chandrababu, P4 program, APnews

Andhrapradesh: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం

అమరావతి: పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14 వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. పన్నులు - పేదలను ఒకే వేదికపైకి తీసుకురావడమే పీ-4 ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కాగా పేదలకు అండగా నిలవాలనుకునే దాతలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తగిన సహకారం అందజేయవచ్చు. వికసిత భారత- స్వర్ణాంధ్ర-2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పీ-4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5గం.ల నుండి రాత్రి 7గం.ల వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. పీ -4 కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తుంది. ఇందులో పేద కుటుంబాల వివరాలను పొందుపరుస్తుంది. దాతలు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా తాము సహాయం చేయాలనుకున్న కుటుంబాలను ఎంపిక చేసుకోవచ్చు.

Next Story