గుడ్‌న్యూస్‌.. నేడు మత్స్యకారుల ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.20,000

సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు.

By అంజి
Published on : 26 April 2025 6:40 AM IST

CM Chandrababu, Fishermen, Financial assistance, APnews, Srikakulam

గుడ్‌న్యూస్‌.. నేడు మత్స్యకారుల ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.20,000

అమరావతి: సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సముద్రంలో వేటకు విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయంగా 1,29,178 మంది ఖాతాల్లోకి రూ.20,000 చొప్పున జమ చేస్తారు. అంతకుముందు సీఎం చంద్రబాబు గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

మత్స్య సంపద సంఖ్యను పెంచడానికి ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 16 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉంది. ఈ టైంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. ఈ క్రమంలోనే మత్స్యకారులకు ఉపాధి పరంగా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం మత్స్యకార సేవలో పథకాన్ని అమలు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కింద రూ.10 వేలు సాయం అందించగా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సాయాన్ని రూ.20 వేలకు పెంచింది.

Next Story