కడప జిల్లా బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు విడిచిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ విషయమై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు విద్యార్థిని కుటుంబ సభ్యలతో ఫోన్ లో మాట్లాడి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని.. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని బాధిత కుటుంబ సభ్యులకు సీఎం హామీ ఇచ్చారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని తెలిపారు. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని బాధిత కుటుంబానికి సీఎం హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. బాలిక తల్లికి ఉపాథి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.