ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. త్వరలోనే కానిస్టేబుల్‌ పోస్టుల నియామకాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌ చెప్పారు. త్వరలోనే కానిస్టేబుల్‌ నియామకాలను చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు.

By అంజి
Published on : 22 Oct 2024 6:27 AM IST

CM Chandrababu, constable posts, APnews

ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. త్వరలోనే కానిస్టేబుల్‌ పోస్టుల నియామకాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌ చెప్పారు. త్వరలోనే కానిస్టేబుల్‌ నియామకాలను చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు. వైసీపీ హయాంలో అర్ధంతరంగా నిలిపివేసిన 6,100 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో గోషామహల్‌ మైదానం తరహాలో.. అమరావతిలో పోలీసు అమరవీరుల స్తూపం, స్మారక మైదానం నిర్మిస్తామని చెప్పారు.

''గత ప్రభుత్వం పోలీసుల స‌రెండ‌ర్ లీవ్‌లు, జీపీఎఫ్‌, టీఏ బిల్లులు మొత్తం రూ.763 కోట్లు పెండింగ్‌ పెట్టింది.వాటిని క్లియ‌ర్ చేస్తాం. పోలీసు సంక్షేమం కోసం రూ.20 కోట్లు ఇస్తాం'' అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో మావోల సమస్య, హైదరాబాద్ మతకలహాలు, రాయలసీమ ముఠాలు, ఎన్నో సామాజిక సమస్యల్ని పోలీసులు పరిష్కరించారు. దేశంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అగ్ర స్థానంలో ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మళ్లీ ఆ గౌరవాన్ని దక్కించుకోవాలని ఆకాంక్షించారు.

Next Story