విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్ల ప్రారంభానికి ముందే తల్లికి వందనం డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

By Knakam Karthik
Published on : 25 March 2025 10:15 AM

Andrapradesh, Cm Chandrababu, Thalliki Vandanam Scheme, Implemented From May

విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్ల ప్రారంభానికి ముందే తల్లికి వందనం డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. స్కూళ్లు ప్రారంభానికి ముందే, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఒక్కొక్కరికి రూ. 15000 చొప్పున తల్లికి వందనం పథకం కింద అందించాలి..అని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల సమావేశం అమరావతిలోని సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు చొప్పున అందజేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ నాలుగు వందలతో ప్రారంభించిన పింఛన్‌ను నాలుగు వేలకు చేశామ‌ని, దేశంలో ఎక్కడ లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 204 అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేశామని, దీపం పథకం కింద‌ ఆడబిడ్డలకు ఒక సిలీండర్ ఉచితంగా ఇచ్చామ‌ని, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామ‌ని, చెత్త పన్ను రద్దు చేశామ‌ని, బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10శాతం రిజర్వేషన్ ఇచ్చామ‌ని, చేనేతలకు జీఎస్టీ రద్దు చేశామ‌ని చంద్రబాబు చెప్పారు.

Next Story