స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

By -  Knakam Karthik
Published on : 13 Jan 2026 3:40 PM IST

Andrapradesh, CM Chandrababu, Sankranti celebrations, Naravaripalli

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో చంద్రబాబు, బాలకృష్ణల మనవళ్లు కూడా పాల్గొన్నారు.

అనంతరం ఆటల్లో విజేతలైనవారికి బహుమతులు అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు ముచ్చటించారు. దాదాపు రెండు గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం చంద్రబాబు గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమానాలు అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను అందుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story