గుడ్‌న్యూస్..రేపే అకౌంట్లలోకి రూ.15,000
రేపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By - Knakam Karthik |
గుడ్‌న్యూస్..రేపే అకౌంట్లలోకి రూ.15,000
అమరావతి: రేపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రేపు (04.10.25) ఉదయం 9:30 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి పరిధి లోటస్ (ప్రకాశం బ్యారేజ్ )వద్ద నుండి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ,రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ,ఇతర మంత్రులు పాల్గొననున్నారు.
కాగా ఏపీలో ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయల చొప్పున అందించనున్నారు. దీనికి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే పేరును ఖరారు చేశారు. ఇటీవల ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంతో తాము ఉపాధికి దూరమవుతామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఆటో డ్రైవర్ కు 15 వేల రూపాయలు సాయం అందించేందుకు నిర్ణయించింది. దరఖాస్తులను ఆహ్వానించింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది వరకు ఆటో డ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా తేలింది. రేపు వీరికి ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున నగదు జమ చేయనున్నారు.