ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఓ ఐఏఎస్ అధికారి కలెక్టర్ల సదస్సులో చెప్పగా సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు జిల్లాకు 200 చొప్పున పెన్షన్ల మంజూరుకు అనుమతి ఇచ్చారు. ఇన్‌ఛార్జ్ మంత్రి, కలెక్టర్ కలిసి వీటిపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్లకు 200 పింఛన్లు మంజూరు చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నామని, ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుందని సీఎం ప్రకటించారు.