సీఎం చంద్రబాబు ఛైర్మన్‌గా P-4 ఫౌండేషన్

ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్‌పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.

By Knakam Karthik
Published on : 7 May 2025 5:34 PM IST

Andrapradesh, Cm Chandrababu, Government Of Andrapradesh, P-4 Foundation

సీఎం చంద్రబాబు ఛైర్మన్‌గా P-4 ఫౌండేషన్

ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్‌పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. బుధవారం సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికీ కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో శిక్షణతో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయ శాఖ అధికారి నుంచి సెక్రటరీ వరకు... కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కెపాసిటీ బిల్డింగ్ జరగాలి. ‘నేను కూడా నిత్యం కెపాసిటీ బిల్డింగ్‌పై దృష్టిపెడతా...కొత్త విషయాలు నేర్చుకుంటా...టెక్నాలజీ గురించి తెలుసుకుంటా...సాంకేతిక ద్వారా పాలనలో ఎటువంటి మార్పులు తేవచ్చు అనేది తెలుసుకుంటా. ప్రతి ఉద్యోగి శిక్షణ పొందడం ద్వారా నైపుణ్యాలను పొందవచ్చు. ఇది పాలనలో ఫలితాలకు ఎంతో ఉపయోపడుతుంది. సేవల్లో నాణ్యత పెరుగుతుంది’ అని సీఎం అన్నారు.

స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం చేరుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం కాగా... నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ వచ్చే నెల నాటికి రూపొందించనున్నారు. అలాగే థీమాటిక్ రిపోర్ట్స్ జూన్‌కు, సెక్టోరల్ రోడ్ మ్యాప్ సెప్టెంబర్ నాటికి రూపొందుతాయని అధికారులు సీఎంకు వివరించారు. కీలక పాలసీలైన జీరో పావర్టీ పీ4, పాపులేషన్ మేనేజ్‌మెంట్ అంశాలను విజన్‌లో పొందుపరుస్తారు. ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపులు మే 9తో పూర్తికానున్నాయి. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు నెలకొల్పేందుకు 143 నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తించారు. జీరో పావర్టీ పీ4 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 15,315 బంగారు కుటుంబాలను 1,118 మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. పీ4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా 25 మందితో కూడిన జనరల్ బాడీ... దీనికి అనుబంధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎంపవర్డ్ టీమ్స్‌తో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు.


Next Story