అమరావతి: హైవేల తరహాలో రాష్ట్ర రహదారులపైనా టోల్ ఫీజు విధింపునకు యోచిస్తున్నట్టు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాలో అమలు చేద్దామని సీఎం ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యేల అభిప్రాయం కోరగా ఆలోచన బాగుందని అందరూ మద్ధతు పలికారు. టోల్ వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సి వస్తుందని సీఎం అన్నారు. గ్రామాల నుంచి మండలాల వరకు బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో రాష్ట్ర రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం శరవేగంగా రోడ్ల మరమ్మతులు చేస్తున్నామన్నారు. ''మన దగ్గర డబ్బులు లేవు.. ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. హైవేల మాదిరి రహదారుల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే యోచన చేస్తున్నాం. తొలుత ఉభయగోదావరి జిల్లాల్లో అమలు చేస్తాం'' అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు.