Andhrapradesh: ఆశా వర్కర్లకు భారీ గుడ్‌న్యూస్‌

ఆశా వర్కర్లపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.

By అంజి
Published on : 1 March 2025 6:11 AM

CM Chandrababu, Asha workers, election, APnews

Andhrapradesh: ఆశా వర్కర్లకు భారీ గుడ్‌న్యూస్‌

అమరావతి: ఆశా వర్కర్లకు భారీ గుడ్‌న్యూస్‌. ఆశా వర్కర్లపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గరిష్ట వయోపరిమితిని కూడా పెంచనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూరేలా రూల్స్‌ ప్రకారం గ్రాట్యుటీ చెల్లించనున్నారు. ప్రజెంట్‌ ఆశావర్కర్లు నెలకు పది వేల రూపాయల వేతనం పొందుతున్నారు. వారి సేవల ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారు రూ.1.5 లక్షలు అందే ఛాన్స్‌ కల్పించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 ఆశా వర్కర్లు ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

Next Story