నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ చెప్పిన సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.

By Knakam Karthik
Published on : 25 March 2025 11:18 AM IST

Andrapradesh, CM Chandrababu, Unemployess, Tdp

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ చెప్పిన సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల ప్రారంభం నాటికి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టింగులు ఇవ్వాలన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తాం..అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

కాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత కారణాలతో మీటింగ్ హాజరుకాలేదని చెప్పారు. కలెక్టర్లు అంటే టాక్స్ కలెక్ట్ చేసేవారు కాదు, ఆయనే సీఈవో ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కలెక్టర్లు భవిష్యత్‌ను ఊహించుకుని పని చేయాలని సూచించారు. కలెక్టర్‌గా ఉన్న సమయంలో చేసే పనుల కారణంగా ఇమేజ్ శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కలెక్టర్ల గురించి మాట్లాడుతాం. 2014లో రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తున్నామని చెప్పాం.. ఇప్పుడు అంటున్నాం.. దానికి కారణం.. ఈ మధ్య కాలంలో అంతటి విధ్వంసం రాష్ట్రంలో జరిగింది..అని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story