ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళి రోజున మొదటి సిలిండర్‌ను అందిస్తామని వెల్లడించారు. కాగా అధికారంలోకి వస్తే ఏటా మూడు సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వందరోజుల్లో సాధించిన ప్రగతి.. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు సూచించారు.
మంగళగిరిలో బుధవారం నాడు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్దామని ఎమ్మెల్యేలు ,ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇకపై రైతు నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని సీఎం తెలిపారు. రైతులకు బిందుసేద్యం పరికరాలను 90 శాతం రాయితీతో అందించే పథకాన్ని పునరుద్ధరించామన్నారు.
పోలీసు శాఖను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌కు అవసరమైన భూములను అందించామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ నిరవహణలో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. వరద బాధితులకు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత అత్యధిక పరిహారాన్ని ప్రకటించామని సీఎం తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచామన్నారు.