మైనార్టీలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌.. పథకాల రీ స్ట్రక్చర్‌కు ఆదేశం

ముస్లిం మైనారిటీలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్‌ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

By అంజి  Published on  24 Sept 2024 6:11 AM IST
CM Chandrababu, minorities, schemes restructuring, APnews

మైనార్టీలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌.. పథకాల రీ స్ట్రక్చర్‌కు ఆదేశం

ముస్లిం మైనారిటీలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్‌ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకోవాలని సూచించారు. మైనారిటీ సంక్షేమంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఫరూక్‌, అధికారులు పాల్గొన్నారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇమామ్‌లకు, మౌజన్‌లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం ఇవ్వడానికి సీఎం పచ్చ జెండా ఊపారు. మైనారిటీలకు లబ్ది జరిగేలా వ‌క్ఫ్‌ భూముల అభివృద్ధికి సూచనలు చేశారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్లు కు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Next Story