రేపు సీఎంగా బాధ్యతలు తీసుకోనున్న చంద్రబాబు.. తొలి సంతకం..
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు.
By Srikanth Gundamalla Published on 12 Jun 2024 1:02 PM GMTరేపు సీఎంగా బాధ్యతలు తీసుకోనున్న చంద్రబాబు.. తొలి సంతకం..
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్, పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ప్రమణస్వీకార కార్యక్రమం అనంతరం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు పయనం అయ్యారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత మళ్లీ అమరావతి వచ్చి..అక్కడ సీఎంగా బాధ్యతలను స్వీకరించనున్నారు.
అమరావతిలోని సచివాలయానికి రేపు సాయంత్రం వస్తారు చంద్రబాబు. సాయంత్రం 4.10 గంటలకు చాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి సచివాలయంలో మొదటి బ్లాక్‌లోని చాంబర్‌లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల అమలు ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్పీపై చంద్రబాబు తొలి సంతకం చేస్తారు. ఆ తర్వాత రెండో సంతకం గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెట్టనున్నారు. అలాగే సామాజిక పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతూ తీసుకునే నిర్ణయంపై చంద్రబాబు మూడో సంతకం పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేస్తారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వెళ్తూ ఉంటారు. ఆయన ఇష్ట దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కాగా.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అసెంబ్లీలో అయితే 164 స్థానాలను కైవసం చేసుకుంది కూటమి.