పేదలకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం చంద్రబాబు

అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు నిన్న కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.

By అంజి  Published on  13 Dec 2024 7:17 AM IST
CM Chandrababu, poor, APnews, Houses

పేదలకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం చంద్రబాబు

అమరావతి: అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు నిన్న కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. '2029' నాటికి అర్హులు అందరికీ ఇళ్లు నిర్మిస్తామని, స్థలాలు లేని పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మంజూరు చేస్తామని తెలిపారు. త్వరలోనే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అమలు చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఎస్సీలు, చేనేతలకు అదనంగా రూ.50 వేలు, ఎస్సీలకు రూ.75 వేలు ఇస్తామన్నారు.

వైసీపీ వదిలేసిన నిర్మాణాలను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిసెంబర్‌ నాటికి లక్ష ఇళ్లను సిద్ధం చేసి లబ్ధిదారులకు తాళాలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న 6.45 ఇళ్లను 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న రాజీవ్‌ స్వగృహ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అటు ఇప్పటి వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 63 చోట్ల వీటిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. జనసాంద్రత ఎక్కువగా, 40 అడుగుల రోడ్డు సదుపాయం ఉండే ప్రాంతాలను అన్వేషించాలని కలెక్టర్లను ఆదేశించింది. కాగా ఇప్పటి వరకు 199 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Next Story