అమిత్ షాకు చంద్రబాబు ఫోన్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు.

By Kalasani Durgapraveen  Published on  23 Nov 2024 3:53 PM IST
అమిత్ షాకు చంద్రబాబు ఫోన్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయం దాదాపుగా ఖాయమవ్వగా చంద్రబాబు అమిత్ షాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు అపూర్వ విజయం కట్టబెడుతున్నారని, మహారాష్ట్రలో మళ్లీ మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లకూ చంద్రబాబు ఫోన్ చేశారు. మహాయుతి కూటమికి అభినందనలు తెలిపారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన ఇద్దరు డిప్యూటీలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి భారీ విజయం సాధించడంపై సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. ఆ తర్వాత, ముంబైలోని బీజేపీ మహారాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే వేడుకలకు ఫడ్నవీస్ హాజరవుతారు.

Next Story