ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..14న కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు

By -  Knakam Karthik
Published on : 10 Oct 2025 12:19 PM IST

Andrapradesh, Vishakapatnam, AP Data Centers, Cm Chandrababu, Nara Lokesh

ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..14న కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్‌కు సంబంధించి ఢిల్లీలో ఈ నెల 14వ తేదీన కీలక ప్రకటన చేయనున్నారు. విశాఖ లో మూడున్నర గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ ప్రతినిధులు తమ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేయనున్నారు. మరోవైపు సిఫీ సంస్థ తన 450 మెగావాట్ల డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు రేపు విశాఖలో భూమి పూజ నిర్వహించనుంది.

కాగా విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద మూడు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తారు. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానంగా ఈ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి. క్వాంటం వ్యాలీ తరహాలోనే డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్‌గా మారతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది

Next Story