కూలీల మృతిపై మానవ‌తాదృక్పథంతో స్పందించిన సీఎం.. రూ. 3 ల‌క్ష‌ల చొప్పున‌ ప‌రిహారం

CM Announces 3 lakh Ex Gratia Who Died With Electric Shock. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో రొయ్య‌ల చెరువు

By Medi Samrat  Published on  31 July 2021 9:21 AM GMT
కూలీల మృతిపై మానవ‌తాదృక్పథంతో స్పందించిన సీఎం.. రూ. 3 ల‌క్ష‌ల చొప్పున‌ ప‌రిహారం

గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో రొయ్య‌ల చెరువు కాప‌లాదారులుగా ఉన్న ఆరుగురు కూలీలు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. మృతిచెందిన కూలీలు ఒడిషా రాష్ట్రానికి చెందిన‌వారు. అయితే కూలీల మృతిప‌ట్ల సీఎం వైయస్‌ జగన్ మానవ‌తాదృక్పథంతో స్పందించారు. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం వారి కుటుంబ‌స‌భ్యుల‌కు అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. బతుకుతెరువు కోసం ఒడిషా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలని అన్నారు.

రొయ్యలచెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లా రేప‌ల్లె మండ‌లం లంకెవానిదిబ్బ‌లో రొయ్యల చెరువు కాపలాదారులుగా ఉన్న ఆరుగురు కూలీలు గురువారం రాత్రి మ‌ర‌ణించారు. వారంతా విద్యుత్ షాక్‌తో మ‌ర‌ణించార‌ని స్థానికులు చెబుతున్నారు. రోజూలాగే గురువారం రాత్రి కూడా కాపలాకు వెళ్లారు. చెరువు గట్టుపై ఉన్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వారు ఉంటున్న షెడ్డుపై కరెంటు తీగలు తెగి పడటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.


Next Story