ఏపీలో మూతబడ్డ వైన్ షాపులు

ఏపీలోని చాలా ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి గత నెలతో ముగిసింది

By Medi Samrat  Published on  1 Oct 2024 11:13 AM GMT
ఏపీలో మూతబడ్డ వైన్ షాపులు

ఏపీలోని చాలా ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి గత నెలతో ముగిసింది. అయితే మరో 10 రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరగా, ప్రైవేట్ వైన్ షాపులు వస్తున్నాయని 10 రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవనే కారణంతో విధుల్లోకి రాలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా వైన్ షాపులు మూతపడ్డాయి.

అక్టోబర్ 12 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. వైన్ షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధానాల్లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 11న మొత్తం 3,396 వైన్ షాపులకు లాటరీ తీస్తారు. టెండర్ దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలు కాగా వైన్ షాపులు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజుల కింద రూ. 50 నుంచి 85 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Next Story