మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారుల విచారణ

CID Question former minister Narayana orders high court. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

By Medi Samrat  Published on  18 Nov 2022 1:15 PM GMT
మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారుల విచారణ

మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. పరీక్షా పత్రం లీకేజ్ కేసులో దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా నారాయణ స్టేట్మెంట్ ను ఏపీ సీఐడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నేడు ఉదయం 11.30గంటలకు అధికారులు నారాయణ నివాసానికి చేరుకున్న అధికారులు విచారణ మొదలు పెట్టారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలపైనా ఆయనను ప్రశ్నిస్తున్నారని.. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే అధికారులు నోటీసు ఇచ్చారని కొన్ని వర్గాలు తెలిపాయి. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ.. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో సీఐడీ విచారణకు హాజరుకాలేడని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వారి కోరిక మేరకు నారాయణను హైదరాబాద్​లోని ఆయన స్వగృహంలో ప్రశ్నించవచ్చని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఉదయం 11 గంటలు నుండి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు విచారణ సీఐడీ అధికారులు విచారణ చేయనున్నారు.


Next Story