ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.

By అంజి
Published on : 8 July 2025 4:59 PM IST

Chief minister Chandrababu,  free apsrtc bus travel, women , APnews

ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రకటించారు. అయితే ఈ ప్రయోజనం కొంత పరిమితులతో ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కం జిల్లాకే ప‌రిమితం అని చంద్రబాబు స్ప‌ష్టం చేశారు. ఏ జిల్లాకు చెందిన మ‌హిళ‌లు.. ఆ జిల్లాలోనే ప్ర‌యాణించేలా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. శ్రీశైలం పర్యటనలో సీఎం చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అటు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కూడా సీఎం మాట్లాడారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కావడం తన లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆ తప్పులు సరి చేసేందుకు రాత్రింబవళ్లు పని చేస్తున్నానని, 24 గంటలు సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు.

Next Story