అమరావతి: కూటమి ప్రభుత్వం నిన్న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 46.85 లక్షల మంది రైతులకు గాను 44.75 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపింది. మొదటి విడతలో భాగంగా రూ.5 వేల రూపాయలను జమ చేసింది. 9552300009 వాట్సాప్ నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. సేవల్లో అన్నదాత సుఖీభవపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే డబ్బులు పడినట్టు స్టేటస్ వస్తుంది.
లేదంటే https://annadathasukhibhava.ap.gov.in/ లోనూ అడిగిన వివరాలు సమర్పించి డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో నిన్న 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పలువురు మహిళలకు చెక్కులు అందజేశారు. ఈ పథకం ద్వారా 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. సందేహాల నివృత్తికి 155261 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు.