ఏపీ ఇంటర్‌ పరీక్షల్లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే

Changes in AP Inter‌ exam dates. ఇంటర్‌ పరీక్షల తేదీలను మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ పరీక్ష రీ షెడ్యూల్‌కు

By అంజి  Published on  3 March 2022 1:45 PM IST
ఏపీ ఇంటర్‌ పరీక్షల్లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే

ఇంటర్‌ పరీక్షల తేదీలను మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ పరీక్ష రీ షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కీలక ప్రకటన చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుండి మే 11 వరకు జరగనున్నాయి. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 23 నుంచి మే 12 వరకు జరగనున్నాయి. గతంలో ఏప్రిల్‌ 8 నుండి 22 వరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడంతో.. ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈ టైంటేబుల్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని ఏపీ సర్కార్‌ తెలిపింది.

జేఈఈ మొదటి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షల షెడ్యూల్‌పై ఇంటర్మీడియట్ బోర్డు పునరాలోచన చేయగా, షెడ్యూల్‌ను మార్చేందుకు కసరత్తు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో పరిస్థితిని సమీక్షించారు. సమీక్షలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, తదితరులు పాల్గొని పలు ప్రతిపాదనలపై చర్చించారు.

Next Story