భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. జాతీయ జెండా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గుండెల్లో నినాదంగా మారాలని అన్నారు. జాతీయ నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని పెంచి.. దేశాన్ని నంబర్‌వన్‌గా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
దేశం ఉన్నంత కాలం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి పింగళి వెంకయ్య అని అన్నారు. ప్రపంచంలోని మేధావులు ఎక్కువ మంది మన దేశంలోనే ఉన్నారని.. ప్రపంచానికే భారతదేశం ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ సినీ రంగాన్ని వదిలి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి, అయితే వ్యవసాయ రంగం తన బాధ్యతను నిర్వర్తించిందని అన్నారు. రైతులు నిజమైన దేశభక్తులని కొనియాడారు.