ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

By అంజి  Published on  12 Jun 2024 11:54 AM IST
Chandrababu, Chief Minister, Andhra Pradesh

ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అనంతరం చంద్రబాబును ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, పలువురు నేతలు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, సూపర్‌స్టార్లు రజనీకాంత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సీఎం, మంత్రులతో ప్రమాణం చేయించారు.

చంద్రబాబు రాజకీయ ప్రయాణం..

28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు.. 30 ఏళ్లకే మంత్రి అయ్యారు. 45 ఏళ్లకు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ట్రాక్‌ రికార్డు ఇది. 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు.. 13 ఏళ్ల 244 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. రాజగోపాల్‌ నాయుడు ప్రోత్సాహంతో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో కాంగ్రెస్‌ తరఫున చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టారు. 1982లో టీడీపీలో చేరిన చంద్రబాబు.. 1983లో చంద్రగిరిలో ఓటమి పాలయ్యారు. 1989 నుంచి వరుసగా 8 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా గెలిచారు. 1995, 1999లో ఉమ్మడి ముఖ్యమంత్రిగా, 2014లో విభజిత ఏపీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వహించారు. 2004 - 14, 2019 - 24 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

చంద్రబాబు మంత్రివర్గం

1.నారా లోకేష్

2.పవన్ కళ్యాణ్

3.కింజెరపు అచ్చెన్ నాయుడు

4.కొల్లు రవీంద్ర

5. నాదెండ్ల మనోహర్

6. పి నారాయణ

7. వంగలపూడి అనిత

8.సత్య కుమార్ యాదవ్

9. నిమ్మల రామా నాయుడు

10. ఎన్‌ఎండీ ఫరూక్

11.ఆనం రామనారాయణరెడ్డి

12. పయ్యావుల కేశవ్

13.అనగాని సత్య ప్రసాద్

14. కొలుసు పార్థసారధి

15. డోలా బలవీరాంజనేయ స్వామి

16.గొట్టిపాటి రవి కుమార్

17. కందుల దుర్గేష్

18.గుమ్మడి సంధ్యారాణి

19. బీసీ జర్ధన్ రెడ్డి

20. టీజీ భరత్

21.ఎస్ సవిత

22.వాసంశెట్టి సుభాష్

23.కొండపల్లి శ్రీనివాస్

24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

Next Story