అది ముమ్మాటికి కక్ష సాధింపే : చంద్రబాబు

Chandrababu slams govt over demolitions at Ayyanna Patrudu's house.అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ సీనియర్‌నేత

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 19 Jun 2022 2:04 PM IST

అది ముమ్మాటికి కక్ష సాధింపే : చంద్రబాబు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ సీనియర్‌నేత అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ నాయకులు మండిప‌డుతున్నారు. ఇంటి గోడ కూల్చివేత ముమ్మాటికీ క‌క్ష‌సాధింపేన‌ని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. టీడీపీలో బ‌ల‌మైన బీసీ నేత‌ల‌ని ల‌క్ష్యంగా చేసుకుని సీఎం జ‌గ‌న్.. అక్ర‌మ కేసులు, అరెస్టులు, దాడుల‌కి పాల్ప‌డుతున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.

చోడ‌వ‌రం మినీమ‌హానాడు వేదిక‌గా వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాడ‌నే అక్క‌సుతోనే అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిపై చీక‌టి దాడులు చేయించారని మండిప‌డ్డారు. అయ్య‌న్న అడిగిన ప్ర‌శ్న‌ల్లో ఏ ఒక్క‌దానికైనా జ‌గ‌న్ స‌మాధానం ఇచ్చే ప‌రిస్థితిలో లేర‌న్నారు. అందుక‌నే కూల్చివేత‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయ్య‌న్న‌పాత్రుడికి టీడీపీ అండ‌గా ఉంటుంద‌ని చంద్ర‌బాబు అన్నారు.

Next Story