ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతిల్లు నిర్మించుకోనున్నారు. ఏప్రిల్ 9న శంకుస్థాపన జరగనుంది. వెలగుపూడి సచివాలయం వెనుక, ఈ9 రహదారి పక్కన భూమిని కొనుగోలు చేసిన చంద్రబాబు బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి గృహ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. రాజధాని ఎంపిక నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యానికి చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారని, ముఖ్యమంత్రి అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని ప్రాంతంలో తనకోసం ఒక ఇల్లు నిర్మించుకోవడం స్థానికులు, ప్రజలలో భరోసా నింపుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడంతో అమరావతి అభివృద్ధి తిరిగి ప్రారంభమైంది. దాని బ్రాండ్ ఇమేజ్ పునరుద్ధరించే పనుల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు తన కోసం ఒక ఇల్లు నిర్మించుకోవడంపై దృష్టి సారించారు.